ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్ జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,18,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
దీంతో అధికారులు ప్రాజెక్ట్ 32 ప్రధాన గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లక్ష 12 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1090.9 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు వెల్లడించారు. నీటి ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు దిగువన పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: