నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుని ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ఫలితంగా అధికారులు 18 గేట్ల ద్వారా 75,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రస్తుతం జలాశయంలోకి 62,933 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు ప్రాజెక్ట్ పూర్తిగా నిండటం వల్ల అధికారులు పర్యాటకులను అనుమతించడం లేదు. భారీ వర్షాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టులోకి మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది.
ఇదీ చూడండి.. నాగార్జునసాగర్ 20 క్రస్ట్ గేట్లు ఎత్తివేత.. దిగువకు నీటి విడుదల