నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో లేకపోవడం వల్ల ప్రాజెక్టు గేట్లను బుధవారం మూసివేశారు. అయితే సాయంత్రం తిరిగి స్వల్ప వరద ప్రవాహం ఉడడంతో 4 గేట్లను ఎత్తి 12,500 క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేశారు.
వాననీటి ఉద్ధృతి అధికంగా ఉండడం వల్ల ఇవాళ ఇన్ఫ్లో 86,973 క్యూసెక్కులకు పెరిగింది. వరద ప్రవాహాన్ని గమనించిన అధికారులు జలాశయం 16 గేట్లను ఎత్తి 75,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు.
ఇదీ చూడండి: సాగర్ 10 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల