నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈరోజు ఉదయం వరద ప్రవాహం పెరగడం వల్ల ఎనిమిది గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 33 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. మెయిన్ గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కులు, ఐదు వేల క్యూసెక్కులు కాకతీయ కాలువ ద్వారా, మూడువేల క్యూసెక్కులు ఎస్కేప్ గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టును తిలకించడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ఇదీ చూడండి : "డెంగీని నివారించండి... లేకపోతే మృతులకు రూ.50 లక్షలు ఇవ్వండి"