ETV Bharat / state

వర్షాలతో శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు జలకళ - వర్షాలతో శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు జలకళ

ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన ప్రవాహంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది.

వర్షాలతో శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు జలకళ
author img

By

Published : Sep 28, 2019, 5:15 AM IST

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. ఈనెలలో కురిసిన భారీ వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన ప్రవాహంతో జలాశయ నీటిమట్టం పెరిగింది. నెల ప్రారంభంలో 18టీఎంసీల నీరు మాత్రమే ఉండగా.. నేటితో 63టీఎంసీల నీటి మట్టాన్ని దాటింది. 2016లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండగా... గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. మళ్లీ ఈ ఏడాది ప్రాజెక్టులో అధిక నీటి నిల్వ కనిపిస్తోంది.
వర్షాకాలం ప్రారంభంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంది. ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి భారీ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండిపోగా... శ్రీరాంసాగర్ మాత్రం నీళ్లు లేక వెలవెలబోయింది. మహారాష్ట్రలో సైతం భారీ వర్షాలకు అక్కడి బాబ్లీ, విష్ణుపురి, గైక్వాడ్ వంటి ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. కానీ శ్రీరాంసాగర్​లో మాత్రం నీటిమట్టం పెరగలేదు. అనూహ్యంగా వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో ప్రాజెక్టులో జలకళ కనిపిచింది.

వర్షాలతో శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు జలకళ
ఆగస్టు 1నాటికి ప్రాజెక్టులో నీటిమట్టం కేవలం 5టీఎంసీలు ఉండి డెడ్ స్టోరేజీతో కళావిహీనంగా కనిపిచింది. ఆగస్టు 3న స్వల్ప ప్రవాహంతో 6టీఎంసీలకు చేరగా.. 7వ తారీఖు వరకు నీటిమట్టం 10టీఎంసీలకు చేరింది. ఆగస్టు 9కల్లా 14టీఎంసీలకు చేరి... తర్వాత మళ్లీ ప్రవాహం మందగించి... 15నాటికి పూర్తిగా ఆగిపోయింది. మళ్లీ సెప్టెంబర్​ 2నుంచి భారీ వర్షాలతో గోదావరిలో ప్రవాహం పెరిగింది. దీంతో సాగర్​లోకి అధిక ప్రవాహం వచ్చి నీటిమట్టం 22టీఎంసీలకు చేరింది. 3, 4 తేదీల్లోనూ ప్రవాహం అధికంగానే ఉండగా.. ఆ తర్వాత ప్రవాహం లేకపోయింది. ఈనెల 20నుంచి వర్షాల ప్రభావంతో ప్రాజెక్టులోకి భారీగా నీటి ప్రవాహం వచ్చింది. 22 కల్లా నీటిమట్టం 50టీఎంసీలు దాటింది. 24వ తేదీకి 56టీఎంసీలకు చేరింది. ప్రవాహం కొనసాగుతూ సెప్టెంబర్ 27వరకు 63టీఎంసీలకు నీటిమట్టం చేరింది. ఈనెల 22నుంచి ఇప్పటి వరకు దాదాపు 15టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది. మహారాష్ట్రలో నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండిపోయి ప్రవాహం కిందకు వచ్చి శ్రీరాంసాగర్​కు నీటిమట్టం పెరుగుతోంది. మరికొన్ని రోజులు ఈ ప్రవాహం కొనసాగితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి మరింత శోభను సంతరించుకోనుంది.

ఇవీ చూడండి: వరుణాగ్రహం... భాగ్యనగరంలో లోతట్టుప్రాంతాలు జలమయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.