నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు వరద కొనసాగుతోంది. 4 గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 1,091 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 91.031 టీఏంసీలు.
ఎగువ నుంచి 24,803 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, ప్రధాన కాలువల ద్వారా మరో 5,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో మూడురోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం..!