నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులో నీటిని నిలువ చేస్తూ.. వరదను ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 1,091 అడుగుల గరిష్ఠ స్థాయి నీటిమట్టం ఉంది. ప్రాజెక్టులో 90 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాలుగు గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 23,500 క్యూసెక్కులుగా ఉంది.
ఇవీ చూడండి: 'చనిపోయిందనుకునే పాతి పెట్టాలనుకున్నాం'