ETV Bharat / state

సృజన టెక్‌ఫెస్ట్‌ - ఆలోచింపజేసే ప్రదర్శనలతో ఆకట్టుకున్న పాలిటెక్నిక్‌ విద్యార్థులు

Srijana Tech fest Held At Mahila Polytechnic College In Nizamabad : మేధస్సుకు పదును పెట్టి ఆహా అనిపించే ఆవిష్కరణలు చేస్తున్నారు ఆ విద్యార్థులు. కళాశాల దశ నుంచే సృజనాత్మకతతో అబ్బురపరుస్తున్నారు. ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకుంటూ వినూత్న ఆవిష్కరణలకు తెర తీశారు. ప్రజలకు ఉపయోగపడే పరికరాల నమూనాలతో ప్రతిభ చాటుతున్నారు. సృజన టెక్‌ఫెస్ట్‌లో ఆలోచింపజేసే ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు పాలిటెక్నిక్‌ విద్యార్థులు. మరి వారు రూపొందించిన ప్రత్యేక పరికరాల విశేషాలేంటో చూసేద్దామా.

Srijana Tech fest Held At Mahila Polytechnic College In Nizamabad
Srijana Tech fest Held
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 1:32 PM IST

సృజన టెక్‌ఫెస్ట్‌లో ఆలోచింపజేసే ప్రదర్శనలతో ఆకట్టుకున్న పాలిటెక్నిక్‌ విద్యార్థులు

Srijana Tech fest Held At Mahila Polytechnic College In Nizamabad : సమాజహితం కోరి మేటి ఆవిష్కరణలకు రూపమిచ్చారు ఈ భావి ఇంజనీర్లు. సాంకేతిక ప్రదర్శనలో పదుగురికి పనికొచ్చే నమూనాలతో ఆకట్టుకున్నారు. దివ్యాంగులు, సైనికులకు ఉపయోగపడే పరికరాలు తయారుచేసి తమదైన ప్రత్యేకత చాటుకుంటున్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభా పాటవాలు చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఈ విద్యార్థులు. నిజామాబాద్‌లోని మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో(Mahila Polytechnic College) జరిగిన సృజన టెక్‌ఫెస్ట్‌ విద్యార్థుల సృజనాత్మకతకు వేదికైంది. జిల్లాస్థాయిలో జరిగిన ఈ పోటీలో విద్యావేత్తలు సైతం ఔరా అనేలా సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఈ విద్యార్థులు. సరికొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. నైపుణ్యాలకు పదును పెట్టుకుని ఉజ్వలభవితకు బాటలు వేసుకుంటున్నారు.

"ఈ యుగంలో మొబైల్ ఎక్కువ ఉపయోగిస్తున్నాం కాబట్టి దానిని ఉపయోగించి ఒక ప్రాజెక్టును తయారు చేస్తే బావుంటుందనే ఆలోచనతో ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేశాం. దీనిని ఉపయోగించి దివ్యాంగులు, ఎవరైతే నడవలేని స్థితిలో ఉన్నారో వారు మొబైల్​ ఉపయోగించి ఇంట్లో ఉన్న లైట్స్​, ఫ్యాన్స్​ ఆన్,​ ఆఫ్​ చేయవచ్చు."-అంజలి, పాలిటెక్నిక్‌ విద్యార్థిని

180గ్రాముల డ్రోన్​- జేబులో తీసుకెళ్లొచ్చట!- ఒక్కసారి రీఛార్జ్​ చేస్తే 25నిమిషాల పాటు గాల్లో చక్కర్లు

Srijana Tech fest Mobile Controlled Home Appliances : ఈ ప్రదర్శనలో అంజలి బృందం రూపొందించిన మొబైల్‌ కంట్రోల్డ్ హోం అప్లియెన్సెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వాటిలో ఒకటి. మొబైల్‌ ఫోన్‌తో ఉన్నచోటి నుంచే ఇంట్లోని వస్తువులను నియంత్రించేలా ఈ నమూనాను తయారు చేశారు. ఆలోచింపజేసిన ఈ ప్రాజెక్టు దివ్యాంగులకెలా మేలు చేస్తుందో వివరిస్తోంది అంజలి. సృజన టెక్‌ఫెస్ట్‌లో(Srijana Tech fest) దివ్యాంగులకే ఉపకరించే మరో నమూనా వాయిస్‌ కంట్రోల్డ్‌ వీల్‌ ఛైర్‌. ఎవరి సాయం లేకుండానే వాయిస్‌ కమాండ్‌ ద్వారా ఇది ఎలా పనిచేస్తుందో ఈ నమూనా ఆధారంగా నిజమైన ఆటోమేటిక్ వీల్‌ ఛైర్‌ ఎలా తయారు చేయవచ్చో విద్యార్థుల మాటల్లోనే

"ఈ ప్రస్తుత కాలంలో వీల్​ ఛైర్​ చాలా ఉన్నాయి. కానీ ఆటోమోటిక్​గా పనిచేసేవి లేవు, కేవలం కమాండ్ ఇవ్వడం ద్వారా లెప్ట్​ రైట్​ తిరిగే వీల్​ ఛైర్​ నడిచే దానిని మేము కనుగొన్నాం. మెుబైల్​ ఆప్లికేషన్​ ద్వారా వీలుఉన్న చోటికి ముందుకు వెళ్లేలా తయారు చేశాం. పక్షపాతం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ఖర్చు రూ.3000-4000 అయ్యింది."-శృతిన్, పాలిటెక్నిక్‌ విద్యార్థి

Tech Shaming Effect On Youth : 'టెక్​ షేమింగ్​'​ ఎఫెక్ట్​.. మానసిక వేదనతో బాధపడుతున్న యువత!.. పరిష్కారం ఏమిటంటే?

Nandipet Polytechnic College Invented RF Control Army Robot : నందిపేట్ పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన ప్రణీత్‌ బృందం ప్రదర్శించిన ఆర్​ఎఫ్​ కంట్రోల్‌ ఆర్మీ రోబోట్‌ అందరినీ ఆలోచింపజేసింది. ల్యాండ్‌మైన్స్‌ను గుర్తించలేక అనేక మంది సైనికులు మృత్యువాత పడటం చూసి ఈ నమూనా తయారు చేశామని చెబుతున్నారు ఈ విద్యార్థులు. ఈ పరికరం సైనికుల ప్రాణాలను రక్షించటంలో ఎలా సాయపడుతుందో వివరిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటూ వినూత్న ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు ఈ భావి ఇంజనీర్లు. ఆధునిక సాంకేతికతపై ఇప్పటి నుంచే పట్టు పెంచుకుని పరిశోధనా రంగంలో రాణించాలని ఆకాంక్షిస్తున్నారు.

"పతి సంవత్సరం వందల సంఖ్యలో సైనికులు చనిపోతున్నారు కాబట్టి మరణాల సంఖ్య తగ్గించడానికి ఆర్​ఎఫ్​ కంట్రోల్​ ఆర్మీ రోబోట్​ యంత్రం తయారు చేశాం. దీన్ని రిమోట్​తో ఆపరేట్​ చేస్తాం. ఈ యంత్రానికి కెమోరా ఉండటం వల్ల నలువైపులా తిరిగే విధంగా కంట్రోల్​ చేయవచ్చు."-ప్రణీత్‌, పాలిటెక్నిక్‌ విద్యార్థి

Iphone 15 Battery Life Charging Speed : ఐఫోన్​ 15 సిరీస్​ బ్యాటరీ లైఫ్​, ఛార్జింగ్​ స్పీడ్​పై టెక్​ లవర్స్​ అసంతృప్తి!..

కేఎల్​ వర్సిటీలో అబ్బుర పరిచిన 'ఈ-వాహన' పోటీలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.