ETV Bharat / state

క్రమక్రమంగా నిండుతోన్న ఎస్సారె​స్పీ ప్రాజెక్టు... - srsp latest News

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్సారె​స్పీ ప్రాజెక్టు క్రమ క్రమంగా నిండుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు వేగంగా వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 10,832గా అడుగులుగా ఉంది.

ఎస్సారె​స్పీ ప్రాజెక్టులోకి దూకుతోన్న గోదావరి... నిండుతోన్న ప్రాజెక్ట్

author img

By

Published : Aug 20, 2020, 1:40 AM IST

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి నీరు వేగంగా వచ్చి చేరుతోంది. రెండు రోజుల్లోనే ప్రాజెక్టులోకి సుమారు 10 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ఇదే తరహాలో కొనసాగితే 3 రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టులో 61 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 91 టీఎంసీలు కాగా... ప్రాజెక్టు​లో గంటకు ఒక పాయింట్ చొప్పున నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. ప్రాజెక్టులో నీటి నిల్వను చూసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి : అంచనాలకు మించి కరోనా కేసులు ఉన్నాయి: సీసీఎంబీ సర్వే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.