ETV Bharat / state

కన్నతండ్రిని కత్తితో పొడిచిన కొడుకు - తండ్రిని హత్య చేసిన కొడుకు

కుటుంబ కలహాలతో తండ్రి మీద దాడి చేసి హత్య చేసిన ఘటన నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లిలో చోటు చేసుకుంది. తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కొడుకు ముక్కుకు తీవ్ర గాయమైంది.

Son Attack On Father With Knife Father Died
కన్నతండ్రిని కత్తితో పొడిచిన కొడుకు
author img

By

Published : May 26, 2020, 11:10 PM IST

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలం ఖిల్లా గ్రామంలో తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి మృతికి కారణమైంది. గ్రామానికి చెందిన వాహిద్​ ఖాన్​ (70)తో కొడుకు అఫ్సర్​ఖాన్​కు కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. గ్రామంలో చికెన్​ దుకాణం నడిపిస్తున్న వాహిద్​ దగ్గరికి వచ్చి అఫ్సర్​ గొడవ పెట్టుకున్నాడు. అక్కడే ఉన్న కత్తితో గొంతులో బలంగా పొడిచాడు. అక్కడే ఉన్న్ ఇనుప రాడ్​తో వాహిద్​ అఫ్సర్​ ముక్కుపై బలంగా కొట్టాడు. గొంతులో కత్తి బలంగా దిగడం వల్ల వాహిద్​ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

ఘర్షణను గమనిస్తున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డిచ్​పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సురేష్​ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తండ్రి మరణానికి కారణమైన అఫ్సర్​ఖాన్​పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: గొర్రెకుంట హత్యల నిందితునికి 14 రోజుల రిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.