నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మహా పూర్ణాహుతి, చక్రస్నానం, శ్రీపుష్ప యాగం నిర్వహించారు. ఆలయ పుష్కరణిలో స్వామివారి చక్రస్నానం కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.
మహాపూర్ణాహుతి అనంతరం దేవనాథ జీయరు స్వామి భక్తులనుద్దేశించి ప్రవచనాలు తెలిపారు. భక్తులు ఎల్లప్పుడూ భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని తెలిపారు. మనిషి తాను మోక్ష మార్గాన్ని అనుసరిస్తూ... సాటి మనిషికి కూడా మోక్ష మార్గాన్ని చూపెట్టాలని సూచించారు. ఇందూరు తిరుమల ఇలలో మరో వైకుంఠంగా ఉద్భవించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు దిల్ రాజు, శిరీష్ రెడ్డి, సీనియర్ నటులు శరత్ బాబు, హాస్యనటులు వేణు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అధికార లాంఛనాలతో జవాను జగదీశ్ అంత్యక్రియలు పూర్తి