ETV Bharat / state

నిజామాబాద్​లో తెరుచుకున్న దుకాణాలు - Nizamabad Municipal Corporation Latest News

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ నిబంధనలను సడలించడం వల్ల నిజామాబాద్​లో దుకాణాలు తెరుచుకున్నాయి. సరి, బేసి విధానంలో దుకాణాలను తెరిచేందుకు నగర పాలక సంస్థ అనుమతులిచ్చింది. రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది.

నిజామాబాద్​లో తెరుచుకున్న దుకాణాలు
నిజామాబాద్​లో తెరుచుకున్న దుకాణాలు
author img

By

Published : May 7, 2020, 3:25 PM IST

నిజామాబాద్ నగరం​లో దాదాపు నెలన్నర తర్వాత దుకాణాలు తెరుచుకున్నాయి. సరి, బేసి విధానంలో దుకాణాలు తెరుచుకోవడానికి నగర పాలక సంస్థ అనుమతించింది. మిగిలిన ఎలక్ట్రికల్, హార్డ్​వేర్​, బట్టలు, రిపేరింగ్, ఇతర దుకాణాలు ఈ రోజు తెరుచుకున్నాయి. 50 శాతం మాత్రమే షాపులు తెరవాలని ప్రభుత్వం ఆదేశించడం వల్ల దుకాణ నంబర్ ఆధారంగా తెరిచేందుకు అనుమతిస్తున్నారు.

దుకాణం బేసి సంఖ్య ఉంటే... బేసి తేదీన తెరవాలని నగర పాలక సంస్థ కమిషనర్ జితేశ్​ వీ పాటిల్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొన్నటి వరకు జనం లేక రోడ్లన్నీ బోసిపోగా.. ఈరోజు రహదారులపై జనసందోహం కనిపించింది.

ఇదీ చూడండి: హైదరాబాద్​లో అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.