ప్రపంచ దేశాలకు వ్యవసాయాన్ని నేర్పిన నేలలో దాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందని... ఎస్‌ఎఫ్‌ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ అన్నారు. దానిలో భాగంగానే అంబానీ, అదానీలకు రైతుల శ్రమను తాకట్టు పెడుతోందని ఆరోపించారు. రైతులకు మద్దతుగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు.
దేశ జీడీపీలో 17 నుంచి 20 శాతం రైతన్నలు పండిస్తున్న పంట ద్వారానే వస్తోందని ఆయన తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాల ద్వారా వారు పూర్తిగా కార్పొరేట్ గుత్తాధిపతుల చేతిలో కీలుబొమ్మగా మారే ప్రమాదం ఉందన్నారు. స్వామినాథన్ సిఫార్సుల మేరకు గిట్టుబాటు ధరలను పెంచి... అన్నదాతలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సీనియర్ అసిస్టెంట్లే సబ్‌రిజిస్ట్రార్లు!