నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ ఎస్సీలు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం సమీపంలో రహదారి పక్కనే గల సర్వే నెంబర్ 1347 ప్రభుత్వ భూమిని, 1194లో మిగులు భూమిని కబ్జా చేశారని ఆందోళన చేపట్టారు. అక్రమ కట్టడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ నాలుగు గంటలకుపైగా తహసీల్దార్ కార్యాలయం ముందు ఎస్సీలు నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన తహసీల్దార్.. తాత్కాలికంగా పనులు నిలిపివేయడం వల్ల ధర్నా విరమించారు.
ఇవీ చూడండి : నిబంధనలు పాటిస్తే గులాబీ పువ్వు... ఓ సినిమా టికెట్