ETV Bharat / state

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు - సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో నిజామాబాద్​ మేయర్

సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిజామాబాద్​లో ఘనంగా నిర్వహించారు. నగర మేయర్​ నీతూ కిరణ్​, ఎస్​ఎఫ్​ఐ, కేవీపీఎస్​ నాయకులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేశారు. మహిళల విద్య కోసం విశేషంగా కృషి చేశారని ఆమె సేవలను కొనియాడారు.

Savitribai Poole Jayanti celebrations in Nizamabad
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
author img

By

Published : Jan 3, 2021, 3:36 PM IST

మహిళల విద్య కోసం కృషి చేసిన సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుని నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్​ నివాళులర్పించారు. మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలుగా ఎందరో స్త్రీల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ​అంబేడ్కర్​ కాలనీలోని విగ్రహానికి పూలమాలలు వేసి, ఆమె చేసిన సేవలను కొనియాడారు.

ముఖ్యంగా విద్యపై అవగాహన కల్పించి మహిళలను చైతన్య పరిచారని తెలిపారు. ఆ రోజుల్లో మహిళలపై జరుగుతున్న దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి హక్కులకై ఉద్యమించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కాంపల్లి ఉమరాణి, ముత్యాలు, కోమల్, ధర్మపురి, అక్బర్ హుస్సేన్, శ్రీనివాస్ రెడ్డి, రైసింగ్, కల్పన, మల్లేశ్, యమునా, అనిల్ పాల్గొన్నారు.

ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో వేడుకలు:
Savitribai Poole Jayanti celebrations in Nizamabad
ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో వేడుకలు:

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్​ఎఫ్​ఐ), కేవీపీఎస్​ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ కొనియాడారు. దేశంలోనే మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలుగా స్త్రీల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయురాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొండా గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: క్రీడల అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.