సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 369వ జయంతి వేడుకలను నిజామాబాద్ పట్టణంలో ఉత్సాహంతో నిర్వహించారు. బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్క యువకుడు కంకణబద్ధులై పనిచేయాలని జిల్లా బీసీ సంఘం నాయకులు పిలుపు నిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మూడు వందల సంవత్సరాల క్రితమే కృషి చేసిన నేత పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన జీవిత చరిత్రను భావితరాలకు అందించడం కోసం అవసరమైన చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంఘం ప్రతినిధులు నరాల సుధాకర్, బుస్సా ఆంజనేయులు, మారయ్యగౌడ్, పోల్కం గంగాకిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 40 తాటి చెట్లు కూల్చేసిన భూస్వామి