నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ముబారక్ నగర్లో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. రంగురంగుల బతుకమ్మలతో వీధులన్నీ కళకళలాడాయి. మహిళలంతా ఒకే చోట చేరి బతుకమ్మ పాటలతో ఆడి పాడారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఉత్సాహంగా గడిపారు.
బతుకమ్మ పాటలతో పట్టణంలోని వీధులన్నీ మారుమోగాయి. వేడుకల అనంతరం మహిళలంతా కలిసి బతుకమ్మలను సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు.