నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా అంటూ ఆడపడుచులు బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు. మహిళలు వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పూలతో అందంగా బతుకమ్మను తయారు చేసి ఆట, పాటలతో సంబురాలు నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలు ఆడి ఊరు చెరువుల్లో నిమజ్జనం చేశారు.
మహిళలు ఒకరికొకరు పసుపు, కుంకుమలు ఇచ్చిపుచ్చుకున్నారు. బతుకమ్మ వద్ద ఉంచిన సద్దులను, ఫలహారాలను అందరు కలిసి పంచుకొని ఆరగించారు. పుట్టినిల్లు, మెట్టినిల్లు చల్లగా ఉండాలని బతుకమ్మను వేడుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరిపారు.
ఇదీ చదవండి.. వాడవాడన అంబరాన్నంటుతున్న బతుకమ్మ సంబురాలు