రైతుల బలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు నిజామాబాద్‌లో పోటీ చేస్తున్న అన్నదాతలు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని ఓ గార్డెన్లో వారు సమావేయమయ్యారు. ఈ నెల 9న ఆర్మూర్‌లో రైతు ఐక్యత సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సభకు రైతు కుటుంబాలు, రైతు ఆధారిత వర్గాలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వాలు దిగి వస్తాయని పేర్కొన్నారు. అధికార పార్టీ సభను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సభలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని రైతులు తెలిపారు. తమలోని చాలా మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని రైతు నాయకులు వెల్లడించారు.
ఈ నెల 9న ఆర్మూర్‌లో రైతు ఐక్యత సభ - meeting
ఈ నెల 9న రైతు ఐక్యత సభ నిర్వహించనున్నట్లు నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న అన్నదాతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని ఓ గార్డెన్లో రైతులు సమావేయమయ్యారు.
![ఈ నెల 9న ఆర్మూర్‌లో రైతు ఐక్యత సభ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2923276-thumbnail-3x2-for.jpg?imwidth=3840)