కరోనా వైరస్ గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించాలని ఆర్టీసీ ఉద్యోగులకు నిజామాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సలోమాన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులకు కరోనా మహమ్మారి గురించి ఆర్టీసీ ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు.
జిల్లాలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు నమోదు కానప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆర్ఎం సలోమాన్ అన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ప్రయాణికుడు మాస్కును తప్పక ధరించేలా చూడాలని సిబ్బందికి సూచించారు.
ఇవీ చూడండి: జూన్ 6వరకు రాష్ట్రంలో న్యాయవ్యవస్థ లాక్‌డౌన్