నిజామాబాద్ నగర శివారు నాగారంలోని రాజీవ్ గృహకల్ప వద్దనున్న శ్మశానవాటికలో కరోనాతో మరణించిన వ్యక్తిని ఖననం చేస్తుంటే కాలనీవాసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులు, స్థానికుల మధ్య వాగ్వాదం జరగగా.. సుమారు రెండు గంటలపాటు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగింది.
రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో మొత్తం 500 నివాస గృహులున్నాయని.. ఇలాంటి చోట కొవిడ్ సోకి మరణించిన వ్యక్తిని ఖననం చేయడం సరికాదని కాలనీవాసులతో కలిసి కొందరు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చివరకు పోలీసుల బందోబస్తు మధ్య మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు.