ETV Bharat / state

జోగినిగా మారబోతున్న యువతికి పెళ్లి చేసిన అధికారులు - పెగడపల్లి

జోగినిగా మారబోతున్న యువతికి అధికారులు పెళ్లి చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్​లో జరిగింది. ఎవరైనా జోగిని వ్యవస్థకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Revenue officials who married the young woman at bodhan in nizamabad district
జోగినిగా మారబోతున్న యువతికి పెళ్లి చేసిన అధికారులు
author img

By

Published : Oct 30, 2020, 2:51 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన సవిత వారం రోజుల క్రితం జోగినిగా మారుతుందన్న సమాచారం మేరకు తహసీల్దార్, పోలీసులు వెళ్లి అడ్డుకుని ఆమెను సదరం హోంకు తరలించారు. అనంతరం యువతి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు.

అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరే వరకు సదరం హోంలో ఉంచారు. శుక్రవారం బోధన్ తహసీల్దార్ కార్యాలయంలో పెంటకలన్​కు చెందిన సాయిలుతో సవిత వివాహం జరిపారు. ప్రభుత్వం నుంచి కల్పించాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని, కల్యాణ లక్ష్మి డబ్బులు అందిస్తామన్నారు. జోగిని వ్యవస్థ రద్దయినా ఇంకా కొన్ని మారుమూల గ్రామాల్లో కొందరు ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఎవరైనా జోగిని వ్యవస్థకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇవీ చదవండి: అబద్ధాల పునాదులపై గెలవాలని భాజపా ప్రయత్నిస్తోంది: హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.