ETV Bharat / state

కవితను ఓడించారని నిజామాబాద్‌ జిల్లా ప్రజలపై కేసీఆర్ పగబట్టారు: రేవంత్​రెడ్డి - తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం 2023

Revanth Reddy Speech at Nizamabad Public Meeting : కవితను ఓడించారని నిజామాబాద్‌ జిల్లా ప్రజలపై సీఎం కేసీఆర్ పగబట్టారని పీసీసీ ఛీఫ్ రేవంత్​రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను వేధించారన్నారు. త్వరలోనే తన పదవి పోతుందని కేసీఆర్‌కు ఆర్థమైందని రేవంత్​ వ్యాఖ్యానించారు. 80కి పైగా సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 80 సీట్లకు తక్కువ వస్తే.. కేసీఆర్‌ వేసే శిక్షకు తాను సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు.

Revanth Reddy Speech at Nizamabad Public Meeting
Revanth Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 3:49 PM IST

Updated : Nov 22, 2023, 4:58 PM IST

కవితను ఓడించారని నిజామాబాద్‌ జిల్లా ప్రజలపై కేసీఆర్ పగబట్టారు: రేవంత్​రెడ్డి

Revanth Reddy Speech at Nizamabad Public Meeting : నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎటువైపు ఉంటారో.. ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి(Revanth Reddy)పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ(Congress Meeting)లో రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లలో పోడు భూముల సమస్య తీర్చలేదని.. లంబాడీలను ఆదుకోలేదని ఆరోపించారు. మంచిప్ప ప్రాజెక్టును పూర్తిచేయలేదన్నారు.

Nizamabad Congress Public Meeting : వందరోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ(Nizam Sugar Factory)ని తెరిపిస్తామని చెప్పి పదేళ్లయినా హామీ నెరవేర్చలేదని రేవంత్​రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavita)ను నిజామాబాద్ రైతాంగం బండకేసి కొట్టారని ధ్వజమెత్తారు. అందుకే అప్పటి నుంచి కేసీఆర్ ఈ ప్రాంత రైతులపై కక్ష కట్టారని మండిపడ్డారు.

Revanth Reddy Fires on CM KCR : బాజిరెడ్డి గోవర్ధన్ నిర్లక్ష్యంతో ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాశారని ఆరోపించారు. 50 మంది ఆర్టీసీ కార్మికులను పొట్టనబెట్టుకున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. కేసీఆర్​కు పదవి పోతుందన్న భయంపట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతి తప్పి మాట్లాడుతున్నారో.. మందేసి మాట్లాడుతున్నారో తెలియట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్​కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్(CM KCR) మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ సాక్షిగా కేసీఆర్​కు.. 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గకుండా ప్రజలు కాంగ్రెస్​ను గెలిపిస్తారని సవాల్ విసిరారు. 80కి ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధమని పేర్కొన్నారు.

'నాడు హైదరాబాద్​లో రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో కాంగ్రెస్ అణచివేసింది అందుకే ఇవాళ ఇంత ప్రశాంతత'

Telangana Congress Election Campaign 2023 : కేసీఆర్ రూ.లక్ష కోట్లు దిగమింగారని ధ్వజమెత్తారు. 10 వేల ఎకరాలు ఆక్రమించుకున్నార్న రేవంత్.. అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్​కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. నిజామాబాద్ జిల్లా రైతులు ఆత్మ గౌరవంతో బ్రతుకుతారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులను పొట్టనపెట్టుకున్న బాజిరెడ్డి గోవర్ధన్​ను పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నుంచి అధిష్టానం తనను బరిలోకి దించిందని తెలిపారు. జిల్లాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్​ను గెలిపించాలని కోరారు.

'కేసీఆర్ గుర్తుపెట్టుకో.. నీ దొరల రాజ్యాన్ని, దొంగల రాజ్యాన్ని పొలిమేరల వరకు తరిమి బొందపెడతాం. బరాబర్ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం.' -రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును చూపించి తాము ఓట్లు అడుగుతామన్న ఆయన.. కాళేశ్వరం మెడిగడ్డను చూపించి కేసీఆర్ ఓట్లు అడగగలవా..? అని రేవంత్ ప్రశ్నించారు. 'కేసీఆర్ గుర్తుపెట్టుకో.. నీ దొరల రాజ్యాన్ని, దొంగల రాజ్యాన్ని పొలిమేరల వరకు తరిమి బొందపెడతాం. బరాబర్ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం.

రాష్ట్ర రాజకీయాల్లో కొడంగల్‌ దంగల్‌ - రేవంత్ రెడ్డి వర్సెస్ పట్నం నరేందర్ రెడ్డి

కేసీఆర్ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ : రేవంత్‌రెడ్డి

Last Updated : Nov 22, 2023, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.