నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. గత నెల రోజుల నుంచి ఉన్న ఉపవాస దీక్షలు నేటితో ముగిశాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని బోధన్, జిల్లా కేంద్రంలోని కిల్లా ఈద్గా, మదీనా ఈద్గా, పూలంగ్ ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. పట్టణ ప్రముఖులు, మున్సిపల్ ఛైర్మన్ ఎల్లయ్య ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: రంజాన్ వేళ వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ