నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం పాత కూస్తపురం శివారులోని పురాతన రామలింగేశ్వరాలయం మళ్లీ బయటపడింది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోయిన సందర్భాల్లో ఆలయాలు బయటపడుతుంటాయి. ప్రాజెక్టు నిర్మాణంతో పురం చుట్టుపక్కల గ్రామాలు ముంపునకు గురయ్యాయి. శ్రీరాముడు అరణ్యవాసంలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటిస్తూ శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల పురంలో రామలింగేశ్వరాలయం, ఉపఆలయాలు ఏర్పడ్డాయి. ఎస్సారెస్పీలో నీటిమట్టం పడిపోయినప్పుడు ఈ ఆలయాలు బయటపడతాయి. ప్రాజెక్టు పూర్తయ్యాక ఇప్పటివరకు రామలింగేశ్వరాలయం ఏడుసార్లు బయటపడింది.
ఇదీ చూడండి : ఎగ్జిట్ పోల్స్‌తో బుల్ జోరు- లాభాల హోరు