నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. పలు చోట్ల రోడ్లపైకి వర్షం నీరు చేరింది. జిల్లాలోని అనేక గ్రామాలకు రాకపోకలు రద్దయ్యాయి. ఆదివారం గంటపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
జిల్లాలోని చెరువులు వాగులు కుంటలు, కొత్త నీటితో జలకళ సంతరించుకుంటున్నాయి. జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి వరద నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువన మహారాష్ట్ర నుంచి వరద నీరు భారీగా వస్తోంది.
ఇదీ చదవండిః ఆదరణకు నోచుకోక.. తల్లిపేగు విలవిల