ETV Bharat / state

Nizamabad: మాధవనగర్​ రైల్వే ఓవర్​ బ్రిడ్జి పనులు వేగవంతం.. ఇంకా కొన్ని రోజుల్లోనే..! - నిజామాబాద్​లోని మాధవనగర్​లో రైల్వే బ్రిడ్జి పనులు

Railway Over Bridge Works In Nizamabad: నిజామాబాద్ జిల్లా మాధవనగర్‌లో ఆర్వోబీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇప్పటికే పిల్లర్, వంతెన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. మాధవనగర్ వద్ద గేట్ పడిన ప్రతిసారి వందల సంఖ్యలో వాహనాలు ఆగిపోవడం, అరగంటకు పైగా వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఈ వంతెన నిర్మాణంతో ఆ ఇబ్బందులు తీరిపోనున్నాయని వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ వంతెన పనులు మరింత వేగంగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

railway
railway
author img

By

Published : Apr 20, 2023, 3:24 PM IST

నిజామాబాద్ జిల్లా మాధవనగర్‌లో ఆర్వోబీ పనులు శరవేగం

Railway Over Bridge Works In Nizamabad: నిజామాబాద్ జిల్లా మాధవనగర్‌లో "రైల్వే ఓవర్ బ్రిడ్జి" నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏళ్ల తరబడి ప్రజలు ఎదురు చూస్తున్న మాధవనగర్ ఆర్వోబీ పనులు వేగం పుంజుకున్నాయి. హైదరాబాద్-నిజామాబాద్ మార్గంలో ఉండే రైల్వే గేట్ గుండా నిత్యం సుమారు 50రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. గేటు పడిన ప్రతిసారి ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు 10నిమిషాల నుంచి అరగంట వరకు వేచి చూడాల్సిందే. కొన్నిసార్లు అత్యవసర చికిత్సకు వెళ్లే అంబులెన్సులు ట్రాఫిక్​లో చిక్కుకోవాల్సి వస్తోంది. అలాంటి క్లిష్టమైన రైల్వే గేట్‌పై ఎంపీ అర్వింద్ ప్రత్యేక చొరవ చూపి వంతెన పనులు ప్రారంభమైయ్యేలా చూశారు.

రెండేళ్ల కాల పరిమితితో వంతెన నిర్మాణం చేపట్టారు. ఒక కి.మీ. పొడువు, 150 అడుగుల వెడల్పుతో రైల్వే ట్రాక్ పై వంతెన నిర్మిస్తున్నారు. రూ. 90 కోట్ల నిధులతో పనులు చేపట్టగా కేంద్రం రూ.30 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 60 కోట్లు అందించింది. దీంతో నిత్యం నిర్విరామంగా పనులు సాగుతున్నాయి. పిల్లర్లు నిర్మిస్తూనే వంతెన నిర్మాణానికి అవసరమైన అడ్డుకట్ట సైతం సమాంతరంగా నిర్మిస్తున్నారు. తద్వారా పిల్లర్లు పూర్తయ్యే సరికి వంతెన నిర్మించేందుకు అవసరమైన అన్ని పనులనూ చేస్తున్నారు. దీంతో వాహనదారులకు, నగరవాసులకు ట్రాఫిక్​ రద్దీ నుంచి ఉపశమనం కల్పించనున్నారు.

వాహనదారుల పాట్లు: పనులు జరుగుతుండంతో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే పనులు జరుగుతున్న ప్రదేశం నుంచి అనుమతి కల్పించారు. మిగతా వాహనాలన్నీ కంఠేశ్వర్ బైపాస్ మీదుగా లేదంటే మోపాల్ మీదుగా డిచిపల్లి వైపుగా వెళ్తున్నాయి. దీనితో చాలా సమయం వృథా అవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి వంతెన పనులు త్వరతగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. దశాబ్ధాలుగా నిజామాబాద్ ప్రజలు మాధవనగర్ వద్ద ఆర్వోబీ కోసం ఎదురు చూస్తుండగాఎట్టకేలకు వంతెన పనులు సాగుతుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

"మాధవనగర్​లోని రైల్వే ఓవర్​ బ్రిడ్జి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇంకా కొంచెం వేగంగా పనులు పూర్తి చేస్తే ప్రజా రవాణాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఈ పనులు జరగడం వల్ల ప్రజలు చాలా దూరం ప్రయాణించి అనుకున్న ప్రదేశానికి వెళ్లవలసి వస్తుంది. ఇప్పుడు వాహనాలు రాకపోకలు సాగించడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది." - స్థానికులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.