నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీకి ఎన్నికలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
అక్కడి పనులను ఆర్డీవో గోపి రామ్... మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్తో కలిసి పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించడానికి పాఠశాలల బస్సులు, ప్రైవేట్ వాహనాలను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్.. దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'