నిజామాబాద్ జిల్లా ఆర్ముర్, నందిపేట్, మాక్లూర్ మండలాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. రోడ్లపై ఆరబెట్టిన మొక్కజొన్న, వరి, సొయా పంటలు తడిసి ముద్దయ్యాయి. చేతికొచ్చిన పంటను ఇలా పాడైపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా సొయా విత్తనాలు తడిస్తే మొలకెత్తే స్వభావం ఉంటాయి. మక్కలు కూడా మక్కీ పోతున్నాయి. రైతులకు అరాబేట్టే తిప్పలు తప్పడం లేదు. ఇలా అనేక రకాలుగా పంటను నష్టపోతున్నామని తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి : మహిళను వెంబడించి అరెస్టు చేసిన పోలీసులు