గత నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరువులు నిండుకుండల్లా మారాయి. చెరువులు అలుగుపారుతూ జలపాతాలను తలపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని సిర్నాపల్లి జానకీబాయి చెరువు సుందరదృశ్యాన్ని తలపిస్తోంది. చుట్టూ దట్టమైన అడవి మధ్యలో చెరువు అందాలను తిలకించేందుకు పర్యటకులు భారీగా తరలివస్తున్నారు. చెరువు అలుగు ఎత్తులో ఉండడం వల్ల నీరు జాలువారుతోంది. ఈ జలపాతాన్ని చూసేందుకు వచ్చిన సందర్శకులతో సందడి నెలకొంది. పర్యాటకులు చేస్తున్న సందడిపై ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీశైలం మరింత సమాచారం అందిస్తారు.
ఇవీ చూడండి: బతుకమ్మ కోసమే విరబూస్తున్నట్లుగా... కట్టిపడేస్తున్నాయ్