నిజామాబాద్ జిల్లా బోధన్ వ్యవసాయ మార్కెట్లో ప్రభుత్వ శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే షకీల్ అమీర్ ప్రారంభించారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని ఆయన అన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పలు ప్రాజెక్టులు ద్వారా నీరు అందించేలా చూస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.4,875 అని పేర్కొన్నారు. బయట దళారుల చేతికి పంటను అప్పగించి మోసపోవద్దని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చంద్ర శేఖర్, ఆర్డీఓ గోపి రామ్, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.