నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రం వచ్చాకే వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాల నియామకాలలో కూడా రిజర్వేషన్లను తీసుకురావడం జరిగిందన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఎకరాకు ఏటా రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతుండటం సీఎం కేసీఆర్ చేసి కృషే కారణమని ఆయన అన్నారు.
ఇవీ చూడండి: దసరా సెలవులు మరోవారం పొడిగింపు