ETV Bharat / state

Paddy Cultivation Different Shapes In Nizamabad : ప్రకృతితో మమేకం.. రసాయనాలకు దూరం... నిజామాబాద్‌లో విభిన్న రూపాల్లో వరి సాగు - సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు

Paddy Cultivation Different Shapes In Nizamabad District : దిగుబడి పెంపు తెగుళ్ల నివారణకు రైతులు అవలంబిస్తున్న పద్ధతులు వాడుతున్న రసాయనిక ఎరువులు వరిసాగు కష్టాలకు కారణమవుతున్నాయా? అంటే అవుననే చెప్పాలి. సంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి పలకడం ద్వారా నేలసారాన్ని కోల్పోతుంది. చాలా మంది రైతులకు ఎరువులను ఏ మోతాదులో వాడాలన్న విషయంపై అవగాహన లేకపోవడం ఇందుకు కారణమవుతున్నది. కానీ!...వీటిని అధిగమిస్తూ ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడిని సాధిస్తున్నాడు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ రైతు..ఆ కథేంటో చూద్దాం..

A farmer cultivating rice in different forms in Nizamabad
Paddy Cultivation Different Shapes In Nizamabad
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2023, 5:01 PM IST

Paddy Cultivation Different Shapes In Nizamabad ప్రకృతితో మమేకం.. రసాయనాలకు దూరం. నిజామాబాద్‌లో విభిన్న రూపాల్లో వరి సాగు చేస్తున్న రైతు

Paddy Cultivation Different Shapes In Nizamabad : నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని చింతలూర్‌ గ్రామానికి చెందిన నాగుల చిన్న గంగారాం ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ వ్యవధిలో చేతికొచ్చే వంగడాలను పండిస్తున్నాడు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2007లోనే తన అర ఎకరం భూమిలో ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలో నేచర్‌ ఫార్మింగ్‌పై పట్టు సాధించిన గంగారాం ప్రస్తుతం 3 ఎకరాల విస్తీర్ణంలో అదే పద్ధతిలో దాదాపు 110 రకాల వంగడాలను సాగు చేస్తున్నారు.

తాను చేస్తున్న వ్యవసాయంలోనూ వైవిధ్యం ఉండే విధంగా వరి వంగడాలతో కళాకృతులను సృష్టిస్తున్నానంటున్నాడు చిన్ని కృష్ణ..... గత ఏడాది చిన్న కృష్ణ తన అమ్మానాన్నల చిత్రాలతో తన వ్యవసాయ క్షేత్రంలో పంట పండించాడు. ఈ సంవత్సరం జీ-20 2023 ఇండియా, శివ లింగం, ఓం ఆకారంలో ఐదు రకాల వరి వంగడాలతో చిన్ని కృష్ణ రైతు చేస్తున్న వినూత్న వ్యవసాయం అందరినీని ఆకట్టుకుంది. నిజామాబాద్ నగర శివారులోని గుపన్ పల్లి శివారులో 5 రకాల వరి వంగడాలతో పొలాన్ని నాటాడు. జపాన్ రైతులు వ్యవసాయాన్ని ఎంతో ఇష్టంతో ఆస్వాదిస్తూ అద్భుతాలను సృష్టిస్తున్నారని.. వారిని ఆదర్శంగా తీసుకొని వరి వంగడాలతో కళాకృతులను తీర్చిదిద్దుతున్నట్లు చిన్నికృష్ణ తెలిపారు.

వ్యవసాయంపై మక్కువతో మేడపైనే వరిసాగు

''జపాన్​ రైతులు వ్యవసాయాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ అద్భుతాలను సృష్టిస్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని వివిధ ఆకృతులలో పంటలు వేస్తున్నాము. చింతలూర్ సన్నాలు, పంచ రత్నా, బంగారు గులాబీ, కాల బట్టి, గోదావరి ఉస్కె వరి వంగడాలతో పొలాల్లో నాటు వేశాము. అప్పట్లో మా అమ్మ నాన్న ఫోటోలేస్తే ప్రపంచంలో గుర్తింపు పొంది చాలా అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అద్భుతమైన శివలింగం ఆకారాన్ని ఐదు రకాల వరి వంగడాలతో చేశాము. చాలా బ్రహ్మాండంగా అన్నపూర్ణా దేవి శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నట్లుగా ఉంది. మేం ఇద్దరం కలిసి 3 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 110 రకాల వంగడాలను సాగు చేస్తున్నాము.'' -నాగుల చిన్ని కృష్ణ, ప్రకృతి వ్యవసాయదారుడు, మహాదేవ్ శివలింగ చిత్రకారుడు

రాష్ట్రంలో వరిసాగే అధికం.. కొంతపెరిగిన నూనెగింజలు, కూరగాయల సాగు

పాఠశాల, కళాశాల విద్యార్థులకు కూడా వ్యవసాయ క్షేత్రంలో ఎన్నో తరగతులు నిర్వహిస్తూ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నాడు. సందర్శించిన ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయంతో అద్భుతమైన దిగుబడిని సాధిస్తూ తోటి రైతులకు మార్గనిర్దేశనం చేస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

''ఎలాంటి మందులు లేకుండా ఆర్గానిక్ పంటలు వేయడంతో అనారోగ్యాలకు గురికాకుండా ఉంటాము. అంతటా ఆర్గానిక్ పంటలు వేయాలని అందరికీ అవగాహన కల్పించాలి. వ్యవసాయ క్షేత్రంలో మాకు తరగతులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది.'' -కార్తీక్, విద్యార్థి

Rice Cultivation Issue: యాసంగిలో వరి సాగుపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..?

భారతదేశానికి అక్షయ పాత్రగా తెలంగాణ.. ధాన్యం ఉత్పత్తిలో టాప్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.