జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అంకితభావంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ఎమ్.రామ్మోహన్ రావు సూచించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని గ్రామస్థాయిలో అమలు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: స్థానిక సమరానికి మోగిన నగారా