నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని కిరాణా దుకాణంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకిర్ అలీ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పట్టణంలోని స్వాగత్ హోటల్ ఎదురుగా గల నవీన్ కిరాణా దుకాణంపై దాడి చేసి రూ. లక్ష విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కార్తికేయ ఆదేశాల మేరకు దాడి చేసినట్లు షాకీర్ అలీ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లను స్థానిక ఎస్సైకు అందజేసినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం