శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పది రోజులుగా కురుస్తోన్న వర్షాల కారణంగా ఈరోజు 40 గేట్ల ద్వారా లక్ష 50 వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు. మహారాష్ట్ర ప్రాంతంలో కురిసిన అధిక వర్షాల వల్ల గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి వరద వస్తోందని... ఇంకా కొనసాగే అవకాశముందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ప్రాజెక్టులో 1,089.80 అడుగుల నీటిమట్టంతో ... 83.772 టీఏంసీల నీరు నిల్వ ఉంది.
ఇదీ చూడండి: రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు