తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్... ఇప్పుడు దానిని ఆచరణలో పెట్టడం లేదని విమర్శించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకుంటే నిరసనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:క్యాబ్ డ్రైవర్ వేధింపులపై ఎంపీ సుప్రియ ఫిర్యాదు