అనుమతి లేదు..
పసుపు రైతుల మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 13 మండలాల్లో 144 సెక్షన్ విధించారు. ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతు నేతలు స్పష్టం చేశారు.
పెద్ద ఎత్తున తరలి వస్తున్న రైతులు..
ర్యాలీలు, రాస్తారోకోలపై పోలీసులు నిషేధాజ్ఞలు విధించినా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ గ్రామీణం నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి:నిన్న 300... నేడు 200