నిజామాబాద్ జిల్లా నవీపేట్లో పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. టెక్నికల్ అసిస్టెంట్ తాము చేసిన పనికి సరిగా కొలతలు చేయడం లేదన్నారు. తక్కువగా డబ్బులు వస్తున్నాయంటూ ఏపీవో రాజేశ్వర్ ను నిలదీశారు. రూ.60 నుంచి రూ.70 మాత్రమే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేసిన పనికి డబ్బులు వచ్చేలా చూడాలని కోరారు. కూలీలు చేసిన పని వివరాలు తెలుసుకుని న్యాయం చేస్తామని ఏపీవో హామీతో ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: 'మార్నింగ్ ట్రైనింగ్ సెషన్స్‌ను మిస్సవుతున్నా'