ETV Bharat / state

ఆర్మూర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్​పై నెగ్గిన అవిశ్వాసం - పదవి కోల్పోయిన వినీత - ఆర్మూర్ మున్సిపాల్టీ

No Confidence Motion Armoor Municipality 2024 : ఆర్మూర్ మున్సిపల్ర్ ఛైర్​పర్సన్ పండిత్ వినీతపై అవిశ్వాసం నెగ్గడంతో ఆమె తన పదవి కోల్పోయారు. కలెక్టర్ ఏర్పాటు చేసిన బల నిరూపణ సమావేశంలో సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి 20 మంది అసమ్మతి కౌన్సిలర్లు, నలుగురు బీజేపీ కౌన్సిలర్లు పాల్గొని అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు.

No Confidence Motion
No Confidence Motion in Armoor Municipality
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2024, 1:03 PM IST

Updated : Jan 4, 2024, 2:38 PM IST

No Confidence Motion in Armoor Municipality : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ ఛైర్​పర్సన్ పండిత్ వినీతపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె తన పదవిని కోల్పోయారు. గత నెల 12వ తేదీన 26 మంది కౌన్సిలర్లు, ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు కలెక్టర్‌కు నోటీసు అందజేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అవిశ్వాస తీర్మానికి బల నిరూపణ సమావేశం జరిగింది.

సొంత పార్టీ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై బీఆర్ఎస్ (BRS) అవిశ్వాసం పెట్టింది. ఈ అవిశ్వాస తీర్మానంలో 20 మంది అసమ్మతి బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నలుగురు బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. బల నిరూపణ ఫలితాల మేరకు ఆర్మూర్ మున్సిపల్ ఛైర్​పర్సన్​గా ఉన్న పండిత్ వినీత తన పదవిని కోల్పోయారు.

Armoor Municipal Chair Person Lost in No Confidence Motion : త్వరలోనే కొత్త వారిని ఎన్నుకునేందుకు వీలుగా కలెక్టర్ మరోమారు కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి కోరం సభ్యులు, ప్రత్యేక అధికారి ఆర్డీఓ వినోద్ కుమార్ హాజరయ్యారు. మున్సిపల్​లో అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటం నెగ్గిందని ఎమ్మెల్యే రాకేశ్ అన్నారు.

ఆర్మూర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్​పై నెగ్గిన అవిశ్వాసం - పదవి కోల్పోయిన వినీత

మళ్లీ తెరపైకి పుర అవిశ్వాసాలు - గవర్నర్ ఆమోదం పొందని అవిశ్వాసాల సవరణ బిల్లు

పురపాలికల్లో రగడ.. ఛైర్మన్‌లపై అవిశ్వాసం నోటీసులు

Last Updated : Jan 4, 2024, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.