ETV Bharat / state

ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం... ఓటింగ్ నిర్వహించిన ఆర్డీవో - ఉపసర్పంచ్‌పై అవిశ్వాసం తీర్మానం

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఆర్డీవో సమక్షంలో ఓటింగ్ చేపట్టగా తీర్మానం నెగ్గినట్లు ప్రకటించారు.

No-confidence motion against vice president of a gannaram village
గన్నారం గ్రామంలో ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం
author img

By

Published : Apr 7, 2021, 3:14 PM IST

ఉపసర్పంచ్‌పై పంచాయతీ పాలకవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టగా... ఆర్డీవో అధ్యక్షతన ఓటింగ్ చేప్టటారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామం ఉపసర్పంచ్ రాజా ప్రసాద్ విధుల్లో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని రెండు వారాల ముందే నోటీసులు జారీ చేశారు. ఈరోజు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఓటింగ్‌కు హాజరు కావాలని ఆర్డీవో రవి ఆదేశాలిచ్చారు.

నెగ్గిన అవిశ్వాసం..

గ్రామ పంచాయతీ పాలకవర్గంలో మొత్తం 12 మంది సభ్యులు ఉండగా... 9 మంది వార్డు సభ్యులు, సర్పంచ్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆర్డీవో ఓటింగ్ నిర్వహించగా 9 మంది మద్దతుగా నిలిచారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఆర్డీవో రవి ప్రకటించారు. ఈ నివేదికను ఎన్నికల సంఘానికి పంపి ఆదేశానుసారం ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఇదీ చూడండి: వామన్​రావు హత్య కేసులో పోలీసుల నివేదికపై హైకోర్టు సంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.