రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు నిజామాబాజ్ జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు. అందులో భాగంగానే పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి నగరంలోని లక్ష్మీ ప్రియా నగర్, కస్తూరీ గార్డెన్ కాలనీల్లోని రోడ్లను శుభ్రపరిచారు.
అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రజలందరూ ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొని ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకోవాలని సూచించారు. దోమలు వ్యాప్తి చెందకుండా మురుగు నీటిని తొలగించుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: ఆదివారం కరోనా పరీక్షలకు ఆటంకం.. మూడొంతుల కేంద్రాల మూత