నిజామాబాద్ నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేశ్ గుప్తా, నగర మేయర్ దండు నీతు కిరణ్ పర్యవేక్షించారు. నగరంలోని 7వ డివిజన్లోని చంద్ర నగర్లో జరుగుతున్న 500 మీటర్ల సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం బోధన్ రోడ్డులో కొనసాగుతున్న కల్వర్టు నిర్మాణ పనులను సందర్శించారు.
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో కొనసాగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులను పర్యవేక్షించి.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. వానాకాలంలో నగరంలో ఎక్కడ కూడా డ్రైనేజి ద్వారా నీరు రోడ్లపైకి రాకుండా పూడికలను పూర్తిగా తొలగించాలని అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్ : సీఎం కేసీఆర్