నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నూడా కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అతి త్వరలో బోర్డు మీటింగ్ నిర్వహిస్తామని ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నూడా డైరెక్టర్లతో చర్చించి అభివృద్ధి ప్రణాళికపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
నూడా కార్యకలాపాలు వేగవంతంగా, పారదర్శకంగా, సమర్థంగా నిర్వహిస్తామని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అక్రమ లేఅవుట్లను అరికట్టడానికి నూడా పరిధిని రెండు (ఉత్తర, దక్షిణ) జోన్లుగా విభజించాలి నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నూడా వైస్ ఛైర్మన్ జితేశ్, వి.పాటిల్ పాల్గొన్నారు.