ETV Bharat / state

బుస్సాపూర్​లో బ్యాంక్ చోరీ.. బంగారం తిరిగివ్వాలని ఖాతాదారుల ఆందోళన - Nizamabad district latest news

Bussapur Bank Robbery: నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్‌లో బ్యాంక్‌ దోపిడీ ఘటనలో నష్టపోయిన వారికి న్యాయం చేయాలంటూ ఖాతాదారులు రోడ్డెక్కారు. చోరీ జరిగి మూడునెలలు కావస్తున్నా నిందితులను పట్టుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దుండగుల కోసం ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హ‌రియాణా తదితర రాష్ట్రాల్లో పోలీసులు గాలిస్తున్నారు.

Bussapur Bank Robbery Latest News
Bussapur Bank Robbery Latest News
author img

By

Published : Oct 17, 2022, 1:38 PM IST

బుస్సాపూర్​లో బ్యాంక్ చోరీ.. బంగారం తిరిగివ్వాలని ఖాతాదారుల ఆందోళన

Bussapur Bank Robbery: మూడునెలల క్రితం బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో భారీ లూటీ జరిగింది. మంకీక్యాప్ వేసుకొని వ‌చ్చిన దొంగలు బ్యాంకు లాకర్లు పగలగొట్టి రూ.3కోట్ల విలువైన 8కిలోల బంగారంతో పాటు 7లక్షల 22వేల రూపాయలు దోచుకెళ్లారు. దుండగుల ఆధారాలు సేకరించిన పోలీసులకు వారిని పట్టుకోవటం సవాల్‌గా మారింది. ఘటన జరిగి మూడునెలలు గడుస్తున్నా కేసులో పురోగతి కనిపించకపోవటంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాము తాకట్టుపెట్టిన తమ సొమ్ము తిరిగివ్వాలని రోడ్డెక్కుతున్నారు. నగదు, బంగారం తిరిగి ఇచ్చేయాలంటూ బ్యాంక్ ఎదుట ధర్నాకు దిగారు. బ్యాంక్‌ అధికారులు పుత్తడి ఇవ్వకుండా తరుగు తీసేసి మిగిలిన బంగారానికి డబ్బులు కట్టి ఇస్తామంటున్నారని వారు వాపోతున్నారు. బ్యాంకు దొంగతనం కేసులో మూడో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద 10 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో చోరీకి పాల్పడిన దొంగలు ఉత్తరప్రదేశ్‌లోని బదౌ, బరేలి, కక్రా జిల్లాలకు చెందినవారుగా గుర్తించారు. తమిళనాడులోని కృష్ణగిరి, కర్ణాటకలోని గుల్బర్గా, తెలంగాణలోని ఖమ్మం జిల్లాదమ్ముగూడెం సహా కరీంనగర్ జిల్లాలోని మంతెన, ఆసిఫాబాద్‌లో ఆ ముఠా బ్యాంకు దోపిడీలు చేసి భారీగా బంగారం దొంగిలించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ

కేసులో రాజును పోలీసులు అరెస్ట్ చేయగా మరో 18 మంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి నిందితులు త్వరగా పట్టుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. చోరీకి గురైన బంగారం ఇవ్వకపోతే ఆందోళనను మరితం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

"బ్యాంకులో దొంగతనం జరిగింది. బాధితులం అందరూ ధర్నాకు దిగాం. ఇప్పటికైనా పోలీసులు స్పందించి నిందితులు త్వరగా పట్టుకోవాలి. చోరీకి గురైన బంగారం ఇవ్వకపోతే ఆందోళనను మరితం ఉద్ధృతం చేస్తాం." -బాధితులు

అసలేం జరిగిదంటే: నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకు దోపిడీ కేసు దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారింది. దొంగలు ఒక్క ఆధారం వదలకుండా జాగ్రత్తపడ్డారు. రెక్కీ నిర్వహించి.. సీసీ కెమెరాలు లేని మార్గంలో బ్యాంకులోకి ప్రవేశించారు. కెమెరాల ధ్వంసం మొదలుకుని.. ఎలక్ట్రానిక్ అలారం తొలగించడం వరకు ప్రణాళిక ప్రకారం చేశారు. ఎక్కడా వేలిముద్రలు పడకుండా.. సర్జికల్ గ్లౌజ్, వాటిపై మరో గ్లౌజ్ ధరించినట్లు తెలుస్తోంది. వాహనం ఊరు వెనకాల నీటి ట్యాంకు వద్ద నిలిపి రావటం చూస్తే.. దొంగలు పక్కా పన్నాగంతోనే వచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవీ చదవండి: పోలీసులకు సవాలుగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు చోరీ కేసు..

Bank theft: మంకీ క్యాప్స్.. గ్యాస్ కట్టర్స్.. జులాయి సీన్ రిపీట్..!

ఆ గుర్తులు తొలగించాలని తెరాస పిటిషన్.. రేపు విచారిస్తామన్నహైకోర్టు

కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్​, ఈ క్షణం కోసమే ఎదురుచూశానన్న సోనియా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.