ETV Bharat / state

నిజామాబాద్​లో ఎస్​ఎఫ్​ఐ నాయకుల నిరాహార దీక్ష

నిజామాబాద్ జిల్ కేంద్రంలో ఎస్​ఎఫ్​ఐ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని... లేనిపక్షంలో తమ ఆందోళన ఆపేదని లేదని హెచ్చరించారు.

sfi leaders protest in nizamabad
నిజామాబాద్​లో ఎస్​ఎఫ్​ఐ నాయకుల నిరాహార దీక్ష
author img

By

Published : Jul 22, 2020, 5:24 PM IST

ఎ​స్​ఎఫ్​ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్​ఎఫ్​ఐ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. కరోనా కారణంగా సందిగ్ధంలో ఉన్న విద్యారంగంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాసంవత్సరాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో తెలపాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ కచ్చితమైన స్పష్టత ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోందని మండిపడ్డారు.

మరోవైపు రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు కరోనా విపత్కర పరిస్థితిని ఉపయోగించుకొని ఆన్​లైన్ క్లాసుల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో జిలా అధ్యక్షులు బోడ అనిల్, ఉపాధ్యక్షులు మహేష్, జిల్లా నాయకులు వేణు, కిరణ్ చారి, విష్ణు, అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.