క్రీస్తు జన్మస్థలమైన జెరూసలేంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన కొంతమంది ప్రజలు క్రిస్మస్ సంబురాలు జరుపుకున్నారు. పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఏసు చూపిన మార్గంలో నడుచుకుంటూ ప్రతి ఒక్కరు ప్రేమ, కరుణతో ఉండాలని దైవసేవకులు జోబ్ కొడాలి సూచించారు. ప్రార్థనల అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో పాస్టర్ కృపరావు, ఆర్మూర్‌కు చెందిన పెద్ద బైరి సతీష్, అంకాపూర్ ప్రశాంత్, రమాకాంత్, రవిందర్ పాల్గొన్నారు.