ఫ్రెండ్లి పోలీసింగ్‌తో మరోసారి ఆకట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. నిజామాబాద్‌లో ఓ వృద్ధురాలి పుట్టినరోజు వేడుకలు జరిపి ప్రత్యేకతను చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో శ్రీకాంత్ రావు, గంగుబాయిలు నివసిస్తున్నారు. వీళ్ళ కూతురు రోహిణి లాక్డౌన్ కారణంగా హైదరాబాద్‌లో ఉండిపోయింది. కరోనా నేపథ్యం కారణంగా నిజామాబాద్ వచ్చి వేడుకలు నిర్వహించలేని పరిస్థితి ఉన్నానని... తన తల్లి జన్మదిన వేడుకలు నిర్వహించాలని పోలీసులకు ఫోన్ చేసి విజ్ఞప్తి చేసింది.
స్పందించిన నిజామాబాద్ రూరల్ ఎస్సై ప్రభాకర్ తన సిబ్బందితో వెళ్లి వృద్ధురాలి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జన్మదినం సందర్భంగా వారికి పండ్లు అందించి పోలీసుల తరఫున శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల దృశ్యాలని కూతురు రోహిణికి ఫోన్ ద్వారా చూపించారు. పోలీసులు చూపిన ఔదార్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
ఇవీ చూడండి: లాక్డౌన్ భగీరథులు: బోర్ కొట్టి బావులు తవ్వేశారు!