ETV Bharat / state

ఉక్రెయిన్‌ అలజడిలో విద్యార్థులు.. ఆందోళనలో వారి తల్లిదండ్రులు

author img

By

Published : Feb 25, 2022, 12:52 PM IST

Updated : Feb 25, 2022, 1:07 PM IST

Nizamabad Students Stuck in Ukraine : ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం.. ఉజ్వల భవిష్యత్ కోసం ఉక్రెయిన్‌ వెళ్లిన వాళ్లంతా.. ఆ దేశానికి-రష్యాకు మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకున్నారు. ఏ క్షణాల ఏ బాంబు పడుతుందో.. ఏ భవనం కూలుతుందో అర్థంగాక క్షణక్షణం భయంతో బతుకుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుని.. ప్రాణాలు అరచేత పట్టుకుని తెలుగు వాళ్లంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతోంటే.. ఇక్కడ వారి కుటుంబ సభ్యులు గుండెలు అదిమి పట్టుకుని వాళ్లకు ఏం కాకూడదని దేవుడిని వేడుకుంటున్నారు.

Nizamabad Students Stuck in Ukraine
Nizamabad Students Stuck in Ukraine

Nizamabad Students Stuck in Ukraine : క్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టడంతో అక్కడ భీకర పరిస్థితులు నెలకొన్నాయి. వరుస క్షిపణి దాడులతో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని జీవిస్తున్నారు. పలువురు ప్రాణాలు వదిలారు. అక్కడ విద్య, ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన వారు సైతం పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విమాన సర్వీసులు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వీరిని క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.

ఇంజినీర్లు కూడా ఉన్నారు..

Nizamabad People Stuck in Ukraine : సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనిచేస్తున్న ఇంజినీర్లు సైతం అక్కడికెళ్లి స్థిరపడ్డారు. నిజామాబాద్‌కు చెందిన ఓ కుటుంబం ఐదేళ్లుగా ఉక్రెయిన్‌లో ఉంటోంది. కంఠేశ్వర్‌కు చెందిన ఓ యువకుడు నాలుగేళ్లుగా అక్కడ జీవిస్తున్నాడు. కొందరు వైద్య యూనివర్సిటీల్లో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరు ఉంటున్న ప్రాంతంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవు. యుద్ధం మొదలైన నేపథ్యంలో రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయో తెలియట్లేదని మదనపడుతున్నారు.

Russia Ukraine War : ఉక్రెయిన్‌లో ఉన్నత చదువుల కోసం పలు కన్సెల్టెన్సీలు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్నాయి. విద్యా సంవత్సరం ఆరంభానికి రెండు మూడు నెలల ముందు నుంచి వీరు జిల్లాలో డెమో తరగతులు, ప్రచారాలు నిర్వహిస్తుంటారు. ఇలా ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చేసేందుకు వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.

తక్కువ ఖర్చని వెళ్తే..

Russia Ukraine War Updates : ఉక్రెయిన్‌లో వైద్య విద్యను చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకోవచ్చు. రూ.10 లక్షల వరకు ఫీజులు చెల్లిస్తే యూనివర్సిటీల ద్వారా ఎంబీబీఎస్‌ పూర్తవుతుంది. ఇప్పటికే చాలా మంది నిజామాబాద్‌ విద్యార్థులు వైద్య విద్య పూర్తి చేసుకొని తిరిగొచ్చారు. వీరిని చూసి పదుల సంఖ్యలో తాజాగా మొదటి సంవత్సరంలో చేరినట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ న్యాల్‌కల్‌ రోడ్డులో ఉండే ఓ యువతి మొదటి సంవత్సరం కోసం గతేడాది ఉక్రెయిన్‌కు వెళ్లారు. ఈమెతో పాటు పలువురు విద్యార్థులు అదే యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు.

ఇవీ చదవండి :

.

ఇక్కడే అధికం

Russia Ukraine War News : విద్య, ఉద్యోగాల కోసం ఉక్రెయిన్‌కి వెళ్లిన మన వారు ఎక్కువగా రాజధాని కీవ్‌లో ఎక్కువ మంది ఉన్నారు. విన్నిసియా, ఇవానో ఫ్రాంక్విస్క్‌, ఖార్కివ్‌ తదితర నగరాల్లోనూ పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు.

గంటకోసారి ఫోన్‌ చేస్తున్నాం

"మా అబ్బాయి రాహుల్‌ ఎంబీబీఎస్‌ చదివేందుకు నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌ వెళ్లాడు. ఓబ్లాస్ట్‌ రాష్ట్రంలోని ఇవానో ఫ్రాంక్విస్క్‌ నగరంలోని నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. రెండు రోజుల నుంచి అక్కడి పరిస్థితులు తెలుసుకోవడం కోసం గంటకోసారి ఫోన్‌ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం స్పందించి మన దేశానికి చెందిన వారిని జాగ్రత్తగా తీసుకురావాలని కోరుతున్నాం."

ఎంపీపీ రాధ, బలరాం దంపతులు, గాంధారి

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న నిజామాబాద్ వాసులు

యుద్ధ ప్రాంతానికి దూరంగా..

"మా బాబు 2019లో ఉక్రెయిన్‌లోని అజహోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌లో చేరారు. ప్రస్తుత పరిస్థితులపై ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. రెండు దేశాల మధ్య వివాదం నడుస్తున్న ప్రాంతానికి దాదాపుగా వెయ్యి కిలోమీటర్ల దూరం ఉందని చెప్పారు. పోలండ్‌ సరిహద్దుల్లో ఉన్నారట. మాకైతే భరోసా ఇస్తున్నా.. ఒకింత ఆందోళన ఉంది."

- అమరేందర్‌బాబు, బోధన్‌

ఆర్మీ రక్షణలో..

"నా కుమారుడు ఎండీ నిజాముద్దీన్‌ అమాన్‌ ఉక్రెయిన్‌లోని సుమీ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నిత్యం ఫోన్‌లో మాట్లాడుతున్నా. ప్రస్తుతం ఆర్మీ సంరక్షణలో ఉన్నారని చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటే మేలని భావిస్తున్నా."

- రజియా, బోధన్‌

నస్రుల్లాబాద్‌ విద్యార్థి..

నస్రుల్లాబాద్‌ మండల కేంద్రానికి చెందిన ఇల్లందుల సచిన్‌గౌడ్‌ అనే విద్యార్థి ఒడెసా రాష్ట్రంలో ఇరుక్కుపోయాడు. గత ఏడాది అక్టోబరులో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు విద్యనభ్యసించేందుకు వెళ్లాడు. ప్రస్తుతం భారత ఎంబసీతో చరవాణిలో మాట్లాడుతున్నట్లు తల్లిదండ్రులు సాయగౌడ్‌, విజయ తెలిపారు.

Last Updated : Feb 25, 2022, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.