ప్రజలు భౌతిక దూరాన్ని పాటించాలని అధికారులు ఎంత చెప్పినా కొందరి చెవికెక్కడం లేదు. కరోనా ఫలితంగా ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందజేయడానికి ప్రజల ఖాతాల్లో నగదు జమ చేశారు.
ఈ నగదు తీసుకోవడానికి నిజామాబాద్లో కొందరు.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరారు. ఈ సమయంలో ప్రజలెవరూ భౌతిక దూరం పాటించకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
బ్యాంకుల వద్ద ఒకరిద్దరు పోలీసులుంటున్నా ఖాతాదారులు వారి మాటలు పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించి సామాజిక దూరాన్ని పాటించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.